Wednesday, December 29, 2010

ఘంటసాల - పద్యమాల

గాన గంధర్వుడు ఘంటసాల పాడిన
ఎన్నో అద్భుతమైన పాటలు,పద్యాలూ గలవు.
ఆయన అమరజీవి.


భౌతికంగా మన మధ్య లేకపోయినా ,
ఆయన స్వర్గంలో కచేరీలు మొదలు పెట్టి
మూడు దశాబ్ధాలు దాటి పోయినా ,

ప్రజల గుండెల్లో చిరంజీవి.
తెలుగు భాష ఉన్నంత కాలం
ఆయనను మరువడం ఎవరి తరం!!!

ఈ సంగతి అందరికీ  తెలిసినదే  ఐనా ,
ఈ  తరం  వారికి ఆయన పాటలను 

పద్యాలను  పరిచయం చెయ్యవలసిన 
ఆవశ్యకత గలదు.
అందుకే ఈ చిరు ప్రయత్నం.

"ఘంటసాల - పద్యమాల " అనే శీర్షికతో
ముందుగా ఆయన పద్యాలను పరిచయం చేస్తాను.

" పుష్ప విలాపం " తో 

దీనిని ప్రారంభించడం ఇదివరకే జరిగింది.
కారణాంతరాలవల్ల కొనసాగించ లేక పోయాను.

ఇకముందు వరుసగా ప్రకటించడానికి ప్రయత్నిస్తాను.
ప్రతీ ప్రకటన చివరా దానికి సంబందించిన 

లంకె (link) ఇవ్వబడుతుంది.
ఆ లంకె మీద క్లిక్ చేసి 

ఆ అమరగానం వింటూ ,
చదువుతూ ఆస్వాదించి 
ఆనందించవచ్చు.

ళ్ళీ కలుద్దాం.