Monday, April 11, 2011

ఘంటసాల - పద్యమాల (హరిశ్చంద్ర సినిమా-03)

చంద్రమతీ లోహితాస్యులు కాలకౌశికుని వెంట
 వెళ్ళి పోతారు !

                           ********

కాలకౌశికుని వద్ద ధనము తీసుకున్న నక్షత్రకుడు
"ఈ సొమ్ము నే నిన్నిరోజులూ నీ వెంట తిరిగినందులకు
 దారిబత్తెముగా నాకు సరిపోయినది ! మరి మా
గురువుగారి సొమ్ము నెప్పుడిచ్చెదవని " హరిశ్చంద్రుని
అడుగుతాడు !
నిశ్చేష్టుడైన హరిశ్చంద్రుడు అంతలోనే తేరుకొని
" మహాశయా నన్నుకూడా ఎవరికైనా విక్రయించి
 ఋణ విముక్తుని చేయుడని" ప్రార్థిస్తాడు !
అప్పుడు నక్షత్రకుడు హరిశ్చంద్రుని కూడా
కాశీ పట్టణపు వీధులలో అమ్మజూపుతాడు !
వీరబాహుడనే ఛండాలుడు నక్షత్రకుడు అడిగిన సొమ్ము
చెల్లించి హరిశ్చంద్రుని కొనుక్కొని కాటికాపరిగా
నియమిస్తాడు !
        
                 ******

కాటికాపరిగా జీవితయానం సాగిస్తూ ,
శ్మశానంలో , హరిశ్చంద్రుడు :

రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


06) || సీసము ||

కాబోలు, బ్రహ్మ రా - క్షస సమూహం బిది
ఘోషించు చుండె , ఋ - క్కుల , క్రమంబు


కాబోలు, వీరు వి - గత జీవ భాంధవుల్
అడరు చుండిరి , మహా - ర్తా రవముల


కాబోలు , వీరు ట - క్కరి భూత మాంత్రికుల్
నెమకు చుండిరి , కపా - లముల కొఱకు


కాబోలు నిది, పిశా - చీ బాంధవ శ్రేణి
వలలంపు భూవంపు - బంతి సాగె


|| తేటగీతి ||

చిట్లు చున్నవి కాబోలు - చితుల లోన
కాల్ప బడెడు శవాల, కం - కాళ సమితి!
ఇట, పెఠీలను రవములే - యెసగు చుండు
దిక్కు లన్నింట మార్మోత - పిక్కటిల్ల!

           
                   
                       ******

ఆహా ! ఎంత విచిత్రంగా ఉందీ శ్మశానం.
భగవాన్ , ఒకనాడు సకల భూ మండలాన్నీ
నా చే పాలింప జేసి , ఈనాడొక కాటి కాపరిగా
మార్చడం కేవలం నీ కృపే.
రారాజు నుంచి భిక్షకుని వరకూ
మహా విఙ్ఞాని నుంచి అఙ్ఞాని వరకూ
సకల ప్రాణి కోటికీ
ఈ శ్మశానమే అంతిమ రంగం చేసి
నీ సర్వ మానవ సమానత్వం
నిరూపించావు.
ఆహా ఏమి నీ లీల !!!!!

        
            
                 ******

కాటికాపరిగా జీవితయానం సాగిస్తూ ,
శ్మశానంలో , హరిశ్చంద్రుడు :


రచన : జా షు వా
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


07) || సీసము ||

ఇచ్చోట-ఏ-సత్క - వీంద్రుని,కమ్మని
కలము,నిప్పుల లోన - కరగి పో యె !


ఇచ్చోట-ఏ-భూము - లేలు,రాజన్యుల
అధికార ముద్రిక - లంతరించె !


ఇచ్చోట -ఏ-లేత - ఇల్లాలి,నల్ల పూ
సల సౌరు,గంగలో - కలసి పోయె !


ఇచ్చోట ,ఎట్టి , పే - రెన్నికన్,గనుగొన్న
చిత్ర లేఖకుని,కుం - చియ,నశించె !


|| తేటగీతి ||

ఇది,పిశాచు లతో, నిఠ - లేక్ష ణుండు
గజ్జె కదలించి ఆడు , రం - గ స్థలంబు!
ఇది, మరణ దూత, తీక్ష్ణమౌ - దృష్టు లొలయ
అవని పాలించు , భస్మ సిం - హాసనంబు !!


పై రెండు పద్యాలూ వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "
                       
                       *******

కాటికాపరిగా జీవితయానం సాగిస్తూ ,శ్మశానంలో ,
తమ దుస్థితికి చింతిస్తూ , హరిశ్చంద్రుడు :


రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


08) || మత్తేభము ||

అకటా ! ఒక్కని పంచ, దాసి యయి ,య - ట్లల్లాడు ,ఇల్లాలి ,పా
ట్లకునై, కుందుదునా ? సువర్ణమయ డో - లా కే ళికిం బాసి, పొ
ట్టకు నై రో సి, తపించు, నా కొడుకు జా - డన్ గాంచి, దుఃఖింతునా ??
ఇక, ఈ, నీచపు, కాటి కాపరికి , నా - కై నేను , శోకింతునా ???


ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "

                           *******

నిత్యంశవాలతోనే సహ జీవనం చేస్తూ,
వైరాగ్యం పరాకాష్థకు చేరిన వేళ ,
జీవిత సత్యాన్ని తెలుసుకొన్న
హరిశ్చంద్రుడు :


రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


09) || శా ర్దూ ల ము ||

మాయా మేయ జగంబె, నిత్య మని సం - భావించి , మోహంబు నన్
నా యిల్లా లని , నా కుమారు డని , ప్రా - ణంబుండు నందాక ,ఎం
తో ,యల్లాడిన ,ఈ శరీర మిపుడిం- దున్ ,కట్టె లన్ , గాలు చో
ఆ యిల్లాలును రాదు ! పుత్రుడును తో - డై  రాడు !! తప్పింప గన్ !!!

మాయా మేయ జగంబె....

ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "
           
                  

                           *******

శ్మశానంలో , చీకటిలో, కొరవితో తిరుగుతూ,
హరిశ్చంద్రుడు :

రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల


10) || మత్తేభము ||

చతురంభోధి పరీత , భూవలయ , ర - క్షాదక్ష ,జామీ కరా
యత , దండంబు ధరించు నీ కరమె , ఆ - హా ! ఇప్పుడి క్కాటిలో
చితిలో కాలుచు నున్న , ఈ కొరవి దా - ల్చెన్ !! నవ్య మాణిక్య రా
జిత , నీరాజన కాంతికిన్ , బదులు వ - చ్చెన్ , పూజనీయంబుగా!!!


ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "
                               
                               ******


Monday, April 4, 2011

ఘంటసాల - పద్యమాల (హరిశ్చంద్ర సినిమా-02)

ఆ విధముగా రాజ్యాన్ని విశ్వామిత్రునికి దానమిచ్చి
భార్యా పుత్రులతో కలసి కట్టు బట్టలతో నగరము
వదలి వెళ్ళబోతున్న హరిశ్చంద్రుని ఆపి ,
నా యాగ సంరక్షణ కొరకు ఇస్తానన్న ధనము
నిమ్మంటాడు విశ్వామిత్రుడు !
మహాత్మా ! నా కున్న దంతయూ మీకే దానమిచ్చితిని గదా !
మీ యాగ సంరక్షణా ధనము గూడా అందే గలదు !
స్వీకరింపుడని నుడివిన , ఆ హరిశ్చంద్రుని తో
విశ్వామిత్రుడు నా కిత్తునన్న ధనము నెవరికో
దానము జేసి నాకు లేదని యందువా అసత్యవాదీ !
అని దుర్భాష లాడెను !
చేయునది లేక ఆ ధనము చెల్లించుటకు హరిశ్చంద్రుడు
కొంత గడువు కోరెను !
దానికి సమ్మతించిన విశ్వామిత్రుడు తన శిష్యుడైన
నక్షత్రకుని వారి వెంట పంపుతూ రహస్యముగా
నక్షత్రకునితో "మనకు కావలసినది ధనము కాదు !
హరిశ్చంద్రునితో అసత్యమును పలికించుటయే నని
ఙ్ఞప్తి యందుంచు కొనుమని పలికెను !
            
            
                  *******

ఆ విధముగా నక్షత్రకుడు అనుసరించగా
హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి తోనూ
కుమారుడు లోహితాస్యునితోనూ కలసి ఎన్నో
అష్ట కష్టముల నధిగమించి చివరికి
కాశీ పట్టణము చేరి కాశీ విశ్వేశ్వరుని దర్శించి
వేనోళ్ళ నుతించెను !
         
           
                *******

అప్పటికి విశ్వామిత్రుడిచ్చిన గడువు పూర్తికావచ్చినదని
నక్షత్రకుడు తొందరింప ,
స్వామీ నన్నెవరికయినా విక్రయించి మీ ఋణమును
తీర్చివేయుడని సలహా యిచ్చిన చంద్రమతితో
హరిశ్చంద్రుడు :


03) || ఉత్పలమాల ||

అంతటి రాజ చంద్రునకు - ఆత్మజవై , చతురంత కాంత వి
శ్రాంత యశో విశాలుని , త్రి - శంకు నృపాలుని ఇల్లు సొచ్చి , భా
స్వంత కుల ప్రసిద్ధి కొక - వన్నె ఘటించిన , గేస్తురాండ్ర మే
ల్బంతిని ! నిన్ను , ఒక్కనికి - బానిసగా తెగ నమ్ము కొందునే ?


ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "

గడువు లోపు ఋణము దీర్చుటకువేరే దారి
లేక ఇష్టం లేకపోయినా , బాధను దిగమ్రింగుకొని
చంద్రమతిని బానిసగా విక్రయించబూనుకొనిన
హరిశ్చంద్రుడు :


04) || సీసము ||

జవదాటి ఎరుగదీ - యువతీ లలామంబు
పతి మాట రతనాల - పైడి మూట
అడుగు దప్పి ఎరుంగ - దత్త మామల యాఙ్ఞ
అసమాన భక్తి ది - వ్యాను రక్తి
అణు మాత్రమైన బొం - కను మాట ఎరుగదు
కలుష విహీన న - వ్వులకు నైన
కోపంబెరుంగదీ - గుణ వితాన నితాంత
ఒరులెంత తను దూరు - చున్న సుంత


|| తేటగీతి ||

ఈ లతాంగి , సమస్త భూ - పాల మకుట
భవ్య మణి కాంత శబలిత - పాదు డైన
సార్వభౌముని , శ్రీ హరి - శ్చంద్రు భార్య !
దాసిగా , ఈపె , గొనరయ్య - ధన్యులార !!!


ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "

నక్షత్రకుడు అడిగిన సొమ్ము చెల్లించి కాలకౌశికుడు చంద్రమతిని
కొనుక్కుంటాడు ! ఆవుతో పాటే దూడ కూడా ని చెప్పి ఆమెతో
పాటుగా లోహితాస్యుని కూడా తీసుకు పో బోయినప్పుడు
హరిశ్చంద్రుడు :


05) || మత్తేభము ||

కొడుకా ! కష్టము లెన్ని వచ్చినను , నీ - కున్ , నాకు , ఈ కీడు లం
దెడబాటుల్ , ఘటియింప కుండు టొక మే - లే యంచు , నే , సంతసం
బడితిన్ ! కాని , ఎఱుంగ ! నిన్ను, తెగ న - మ్మంజూ పి , హా ! లో హి తా!!!
కడకీ నాటికి , కాల సర్పమునకున్ - గైకోలు

[నాథా ! ఎంతమాటా !! కాల సర్పమా ???
మీ నోట అమంగళ మగు మాటా ???
అమంగళం ప్రతిహత మగు గాక .మా బాబు చిరంజీవి.

నా లోహితుడు చిరంజీవి.]

కడకీ నాటికి , కాలకౌశికునకున్ - గైకోలు గావించుటన్ !!!
కొడుకా !!!!!!!!!!!!!

ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "

Friday, April 1, 2011

ఘంటసాల - పద్యమాల (హరిశ్చంద్ర సినిమా -01)


గాన
గంధర్వుడు
ఘంటసాల 


అభిమానులకు 
స్వాగతం 
సుస్వాగతం


ఘంటసాల - పద్యమాల
కార్యక్రమానికి
స్వాగతం


గాన
గంధర్వుడు
ఘంటసాల


అత్యంత
అద్భుతంగా
అమర


గానం
చేసిన
మధురమైన


పద్యాలు
ఎన్నో
ఉన్నాయి


వాటిలో 
మనం
ఇప్పటివరకూ

01) పుష్ప విలాపం
02) గో ఘోష
03) కుంతీ కుమారి
04) అంజలి
05) మనోహారిణి
06) సాంధ్యశ్రీ
07) అద్వైత మూర్తి
08) ప్రభాతి

పూర్తిచేసుకున్నాము.
ఇప్పుడు
తొమ్మిదవ అంకం
హరిశ్చంద్ర ( సినిమా )
లోనికి
ప్రవేశిద్దాం.  


హరిశ్చంద్ర - 1956


ఒకనాడు ఇంద్ర సభలో సత్యం మీద చర్చ జరుగుతుంది !
ఈ ముల్లోకముల లోనూ సత్య నిష్ఠ పాటించే వారెందైనా
గలరా ? అని దేవేంద్రుడు ప్రశ్నిస్తాడు !
భూలోకములో హరిశ్చంద్ర చక్రవర్తి గలడు !
అతడు నిత్య సత్య దీక్షా పరుడని  చెబుతాడు వశిష్టుడు !
మామూలు పరిస్థితులలో ఎవరైనా పాటిస్తారు ! 
విపత్కర పరిస్థితులలో ఎటువంటి వారైనా
అబద్ద మాడక తప్పదని విశ్వామిత్రు డంటాడు !
సూర్యుడు పడమటి దిక్కున ఉదయించ వచ్చు నేమో గాని
ఎటువంటి పరిస్థితిలో నైనా హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పడని  
వశిష్టుడు చెప్పిన మాటలకు ఒప్పుకొనక , విశ్వామిత్రుడు
హరిశ్చంద్రుని సత్యదీక్షను పరీక్షింప బూనుకొంటాడు !
                   
                  *****
వెంటనే విశ్వా మిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు వచ్చి
ఓ రాజా ! నేనొక యాగం సంకల్పించాను ! 
దానికి , ఒక బలవంతుడైన మనిషి ఏనుగు పై నిలబడి
ఒక రత్నమును బలముగా ఎంత ఎత్తు విసర గలడో 
అంతెత్తు ధనరాశి కావలయునని  అడుగుతాడు !
అటులనే మహాత్మా ! దాని నిప్పుడే మీ ఆశ్రమమునకు 
తరలించే ఏర్పాటు చేస్తానన్న హరిశ్చంద్రుని 
ఆ ఋషి వారించి, మహారాజా ! యాగము మొదలుపెట్టుటకు 
కొంత తడ వున్నది ! అంత దనుక , నా  ధనము , నీ వద్దనే యుంచి , 
నేను యాగము ప్రారంభించబోవు సమయమున కబురు జేసెదను 
అప్పుడు పంపుము ! అని జెప్పి వెడలి పోతాడు !

                 *****
తన పరీక్ష నింకా ఉధృతం జేయనెంచిన ఆ ఋషి
క్రూర మృగములను సృష్టించి , హరిశ్చంద్రుడు
వేటకు వచ్చేలా చేస్తాడు ! వేటాడి అలసి , విడిది చేసియున్న 
హరిశ్చంద్రుని వద్దకు , మాతంగ కన్యలను సృష్టించి పంపుతాడు ! 
ఆ కన్యల ఆట పాటలకు మెచ్చిన హరిశ్చంద్రుడు 
బహుమానా లివ్వబోతే , వారు నిరాకరించి
హరిశ్చంద్రుని వివాహ మాడ గోరతారు !
దానికి నిరాకరిస్తాడా చక్రవర్తి !
ఇదే అదనని విశ్వా మిత్రుడక్కడికి వచ్చి 
తన మానస పుత్రికలైన ఆ కన్యలను 
వివాహమాడి వారి కోరిక దీర్చమని 
శాసిస్తాడు !


రచన : బలిజేపల్లి
సంగీతం :  సుసర్ల దక్షిణా మూర్తి 
గానం : ఘంటసాల

అప్పుడు హరిశ్చంద్రుడు ఆ మునితో :


01) || మత్తేభము ||

అరయన్ , వంశము నిల్పనే కద , వివా - హం , బట్టి  వైవాహిక
స్ఫురణం , బిప్పటి కెన్నడో , జరిగె ! స - త్పుత్రుండు పుట్టెన్ ! వయః
పరిపాకంబును , తప్పుచున్న యది ! ఈ - ప్రాయంబునన్ , వర్ణ సం
కరపుం పెండిలి , ఏల చుట్టెదవు ? నా - కంఠంబునన్ , కౌశికా!!!


ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "

మహాత్మా ! వంశాభివృద్ధి కోసమే గదా వివాహము !
నాకు వివాహము జరిగి , ఒక చక్కని పుత్రుడు కూడా
గలడు ! ఈ వయస్సులో నన్నెందుకు రెండవ పెళ్ళి
చేసుకోమని నిర్భందిస్తావు ! ఈ కన్యలను
వివాహ మాడుట తప్ప , నా ప్రాణములు గాని
నా సంపదలుగాని లేదా నా సమస్త రాజ్యమూ
కావలెనన్న నీకు సమర్పించ గలవాడను
అన్న హరిశ్చంద్రునితో "అటులైన నీ రాజ్యమును
నాకు సమర్పింపుమని అడుగుతాడు విశ్వామిత్రుడు !
తన రాజ్యమును విశ్వామిత్రునికి దానం చేస్తూ
హరిశ్చంద్రుడు :


02) || శార్దూలము ||

దేవ బ్రాహ్మణ మాన్యముల్విడచి , భ - క్తిన్ , సప్త పాదోధి వే
లా విభ్రాజ దఖండ భూవలయ మె - ల్లన్ , నీకు , దానంబుగా
భావంబందొక శంక లే కొసగితిన్ - బ్రహ్మార్పణం బంచు , దే
వా, విశ్రాంతిగ,యేలు కొమ్మికను,నీ - వాచంద్ర తారార్కమున్!

ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "

Tuesday, March 22, 2011

ఘంటసాల - పద్యమాల ( ప్రభాతి )

గాన
గంధర్వుడు
ఘంటసాల


అభిమానులకు
స్వాగతం
సుస్వాగతం


ఘంటసాల - పద్యమాల
కార్యక్రమానికి
స్వాగతం


గాన
గంధర్వుడు
ఘంటసాల


అత్యంత
అద్భుతంగా
అమర


గానం
చేసిన
మధురమైన


పద్యాలు
ఎన్నో
ఉన్నాయి


వాటిలో
మనం
ఇప్పటివరకూ


01)పుష్ప విలాపం
02)గో ఘోష
03)కుంతీ కుమారి
04)అంజలి
05)మనోహారిణి
06)సాంధ్యశ్రీ
07)అద్వైత మూర్తి


పూర్తిచేసుకున్నాము.
ఇప్పుడు
ఎనిమిదవ అంకం


ప్రభాతి

లోనికి
ప్రవేశిద్దాం.


ప్రభాతి

రచన : కరుణశ్రీ
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల


01) || ఉత్పలమాల ||

రేగిన ముంగురుల్ , నుదుట - ప్రేమ సుధా మధురైక భావముల్
ప్రోగులు వోయగా , నిదుర - వోవు దయా మయి ! నా ఎడంద లో
ఆగక పొంగు , స్వాప్నిక , ర - హస్యము లెవ్వియొ , నీదు గుండె తో
దాగుడు మూత లాడ , సర - దా పడు చున్నవి, కన్ను లెత్తుమా !
 

02) || ఉత్పలమాల ||

ఈ గిజి గాని గూడు వలె - నే , మలయానిల రాగ డోల లో
ఊగుచు నుండె , నా తలపు - లూరక , నీ కభరీ భరమ్ము లో
మాగిన కేతకీ సుమ స - మంచిత సౌరభ వీచి , పై పయిన్
మూగి స్పృశించి , నా హృదయ - మున్ కదలిం చుచు నుండె , ప్రేయసీ !


03) || ఉత్పలమాల ||

రాగము నందు కొన్నది , త - రంగిణి ! బాల మరీచి మాలికిన్
స్వాగత మిచ్చె పద్మిని , హ - సన్ముఖియై ! మన  దొడ్డి లోని పు
న్నాగము కుప్పవో సె , సుమ - నస్సులు ! కోవెలలో విపంచికల్
మ్రోగెను ! లెమ్ము , పోదము , ప్ర - మోదముతో , మన మాతృ పూజకున్ !


############### సమాప్తం ################ 

click here " ప్రభాతి "

Monday, March 14, 2011

ఘంటసాల - పద్యమాల ( అద్వైత మూర్తి )

గాన
గంధర్వుడు
ఘంటసాల

అభిమానులకు
స్వాగతం
సుస్వాగతం


ఘంటసాల - పద్యమాల
కార్యక్రమానికి
స్వాగతం


గాన
గంధర్వుడు
ఘంటసాల


అత్యంత
అద్భుతంగా
అమర


గానం
చేసిన
మధురమైన


పద్యాలు
ఎన్నో
ఉన్నాయి


వాటిలో
మనం
ఇప్పటివరకూ


01)పుష్ప విలాపం
02)గో ఘోష
03)కుంతీ కుమారి
04)అంజలి
05)మనోహారిణి
06)సాంధ్యశ్రీ


పూర్తిచేసుకున్నాము.
ఇప్పుడు
ఏడవ అంకం

అద్వైత మూర్తి
లోనికి
ప్రవేశిద్దాం. 


అద్వైత మూర్తి

రచన : కరుణశ్రీ
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల


అది బృందావనం.
మంద మలయానిలుని చక్కిలిగింతలకు
కల కల నవ్వే కాళిందీ తరంగాల్లో
ఒక ప్రేమ నౌక.


నౌకలో రాధా కృష్ణులు.
రాధకు కోపం వచ్చినట్లుంది.
మాట్లాడవేం?
ఏమిటీ మౌనం?


01) || ఉత్పలమాల ||

చూచెద వేలనో ? ప్రణయ - సుందరి !కాటుక కళ్ళలోని ,ఆ
లోచన లేమిటో ? హరిణ - లోచని !నీ చిరు నవ్వు లోని ,సం
కోచము లెందుకో ? కుసుమ - కోమలి !నీ మధురాధరమ్ము లో
దాచు కొనంగ నేటికి ? సు - ధామయ సూక్తి కళా విలాసినీ !

ఆ.....................................................................................

సిగ్గు పడుతున్నావా ? చూడు......

02) || మత్తేభము ||

మన దాంపత్యము, సత్యమౌ ప్రణయ సా - మ్రాజ్యమ్ములో,లోతులన్
గనియెన్ !సాగెను ,భాగ్య నౌక, కవితా - కాళిందిలో ! నవ్య , జీ
వన ,బృందావన ,దివ్య సీమ , విహ రిం - పన్ ,రమ్ము ! నే,కొల్లగొం
దును,నీ,కోమల,బాహు బంధనము లం - దున్,కోటి స్వర్గమ్ములన్! 

అదిగో ! అలా చూడు దేవీ......

03) || శార్ధూలము ||

భావోధ్యానము నందు, క్రొత్త వలపుం - పందిళ్ళలో, కోరికల్
తీవల్ , సాగెను! పూలు పూచెను !రసార్ - ధ్రీ భూత చేతమ్ముతో
నీవే నేనుగ , నేనె నీవుగ , లతాం - గీ ! ఏకమై పోద మీ
ప్రావృణ్ణీరద పంక్తి క్రింద , పులకిం - పన్ , పూర్వ పుణ్యావళుల్ ! 

@@@@@@@@@@  సమాప్తం  @@@@@@@@@@

click here " Advaitamurti "