Tuesday, March 22, 2011

ఘంటసాల - పద్యమాల ( ప్రభాతి )

గాన
గంధర్వుడు
ఘంటసాల


అభిమానులకు
స్వాగతం
సుస్వాగతం


ఘంటసాల - పద్యమాల
కార్యక్రమానికి
స్వాగతం


గాన
గంధర్వుడు
ఘంటసాల


అత్యంత
అద్భుతంగా
అమర


గానం
చేసిన
మధురమైన


పద్యాలు
ఎన్నో
ఉన్నాయి


వాటిలో
మనం
ఇప్పటివరకూ


01)పుష్ప విలాపం
02)గో ఘోష
03)కుంతీ కుమారి
04)అంజలి
05)మనోహారిణి
06)సాంధ్యశ్రీ
07)అద్వైత మూర్తి


పూర్తిచేసుకున్నాము.
ఇప్పుడు
ఎనిమిదవ అంకం


ప్రభాతి

లోనికి
ప్రవేశిద్దాం.


ప్రభాతి

రచన : కరుణశ్రీ
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల


01) || ఉత్పలమాల ||

రేగిన ముంగురుల్ , నుదుట - ప్రేమ సుధా మధురైక భావముల్
ప్రోగులు వోయగా , నిదుర - వోవు దయా మయి ! నా ఎడంద లో
ఆగక పొంగు , స్వాప్నిక , ర - హస్యము లెవ్వియొ , నీదు గుండె తో
దాగుడు మూత లాడ , సర - దా పడు చున్నవి, కన్ను లెత్తుమా !
 

02) || ఉత్పలమాల ||

ఈ గిజి గాని గూడు వలె - నే , మలయానిల రాగ డోల లో
ఊగుచు నుండె , నా తలపు - లూరక , నీ కభరీ భరమ్ము లో
మాగిన కేతకీ సుమ స - మంచిత సౌరభ వీచి , పై పయిన్
మూగి స్పృశించి , నా హృదయ - మున్ కదలిం చుచు నుండె , ప్రేయసీ !


03) || ఉత్పలమాల ||

రాగము నందు కొన్నది , త - రంగిణి ! బాల మరీచి మాలికిన్
స్వాగత మిచ్చె పద్మిని , హ - సన్ముఖియై ! మన  దొడ్డి లోని పు
న్నాగము కుప్పవో సె , సుమ - నస్సులు ! కోవెలలో విపంచికల్
మ్రోగెను ! లెమ్ము , పోదము , ప్ర - మోదముతో , మన మాతృ పూజకున్ !


############### సమాప్తం ################ 

click here " ప్రభాతి "

Monday, March 14, 2011

ఘంటసాల - పద్యమాల ( అద్వైత మూర్తి )

గాన
గంధర్వుడు
ఘంటసాల

అభిమానులకు
స్వాగతం
సుస్వాగతం


ఘంటసాల - పద్యమాల
కార్యక్రమానికి
స్వాగతం


గాన
గంధర్వుడు
ఘంటసాల


అత్యంత
అద్భుతంగా
అమర


గానం
చేసిన
మధురమైన


పద్యాలు
ఎన్నో
ఉన్నాయి


వాటిలో
మనం
ఇప్పటివరకూ


01)పుష్ప విలాపం
02)గో ఘోష
03)కుంతీ కుమారి
04)అంజలి
05)మనోహారిణి
06)సాంధ్యశ్రీ


పూర్తిచేసుకున్నాము.
ఇప్పుడు
ఏడవ అంకం

అద్వైత మూర్తి
లోనికి
ప్రవేశిద్దాం. 


అద్వైత మూర్తి

రచన : కరుణశ్రీ
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల


అది బృందావనం.
మంద మలయానిలుని చక్కిలిగింతలకు
కల కల నవ్వే కాళిందీ తరంగాల్లో
ఒక ప్రేమ నౌక.


నౌకలో రాధా కృష్ణులు.
రాధకు కోపం వచ్చినట్లుంది.
మాట్లాడవేం?
ఏమిటీ మౌనం?


01) || ఉత్పలమాల ||

చూచెద వేలనో ? ప్రణయ - సుందరి !కాటుక కళ్ళలోని ,ఆ
లోచన లేమిటో ? హరిణ - లోచని !నీ చిరు నవ్వు లోని ,సం
కోచము లెందుకో ? కుసుమ - కోమలి !నీ మధురాధరమ్ము లో
దాచు కొనంగ నేటికి ? సు - ధామయ సూక్తి కళా విలాసినీ !

ఆ.....................................................................................

సిగ్గు పడుతున్నావా ? చూడు......

02) || మత్తేభము ||

మన దాంపత్యము, సత్యమౌ ప్రణయ సా - మ్రాజ్యమ్ములో,లోతులన్
గనియెన్ !సాగెను ,భాగ్య నౌక, కవితా - కాళిందిలో ! నవ్య , జీ
వన ,బృందావన ,దివ్య సీమ , విహ రిం - పన్ ,రమ్ము ! నే,కొల్లగొం
దును,నీ,కోమల,బాహు బంధనము లం - దున్,కోటి స్వర్గమ్ములన్! 

అదిగో ! అలా చూడు దేవీ......

03) || శార్ధూలము ||

భావోధ్యానము నందు, క్రొత్త వలపుం - పందిళ్ళలో, కోరికల్
తీవల్ , సాగెను! పూలు పూచెను !రసార్ - ధ్రీ భూత చేతమ్ముతో
నీవే నేనుగ , నేనె నీవుగ , లతాం - గీ ! ఏకమై పోద మీ
ప్రావృణ్ణీరద పంక్తి క్రింద , పులకిం - పన్ , పూర్వ పుణ్యావళుల్ ! 

@@@@@@@@@@  సమాప్తం  @@@@@@@@@@

click here " Advaitamurti "

Wednesday, March 9, 2011

ఘంటసాల - పద్యమాల ( సాంధ్యశ్రీ )

గాన
గంధర్వుడు
ఘంటసాల

అభిమానులకు
స్వాగతం
సుస్వాగతం

ఘంటసాల - పద్యమాల
కార్యక్రమానికి
స్వాగతం

గాన
గంధర్వుడు
ఘంటసాల

అత్యంత
అద్భుతంగా
అమర

గానం
చేసిన
మధురమైన

పద్యాలు
ఎన్నో
ఉన్నాయి

వాటిలో
మనం
ఇప్పటివరకూ


01)పుష్ప విలాపం
02)గో ఘోష
03)కుంతీ కుమారి
04)అంజలి
05)మనోహారిణి


పూర్తిచేసుకున్నాము.
ఇప్పుడు
ఆరవ అంకం

సాంధ్యశ్రీ
లోనికి
ప్రవేశిద్దాం.
 

సాంధ్యశ్రీ

రచన : కరుణశ్రీ
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల


అది సంధ్యా సమయం.
మల్లె పందిరి పూస్తున్నది.
కోయిల కూస్తున్నది.
కవి కుమారుడు కరాలు చాచి,
కరుణా మయుని లాలిస్తున్నాడు.


01)|| ఉత్పల మాల ||

అంజన రేఖ , వాల్ కనుల - అంచుల దాట , మనోఙ్ఞ , మల్లికా
కుంజములో , సుధా, మధుర - కోమల , గీతిక లాలపించు , ఓ
కంజదళాక్షి !నీ , ప్రణయ - గానములో , పులకింతునా !! మనో
రంజని ! పుష్ప వృష్టి పయి - రాలిపి , నిన్ , పులకింప జేతునా!!!


02)|| ఉత్పల మాల ||

క్రొంజికురాకు వ్రేళుల,కు - రుల్,తడి యార్పుచు గూరుచున్న, అ
భ్యంజన మంగళాంగి , జడ - లల్లుదునా ! మకరంద , మాధురీ
మంజుల , మామక , ప్రణయ - మానస భావనలే , ప్రపుల్ల పు
ష్పాంజలి జేసి ,నీ అడుగు - లందు , సమర్పణ జేసి కొందునా!

03)|| ఉత్పల మాల ||

ఓ.......ఒ..ఒ..ఓ...........ఒ...ఒ...ఓ.....

సంజ వెలుంగులో , పసిడి - ఛాయల , ఖద్దరు చీర గట్టి, నా
రింజకు నీరు వోయు ,శశి - రేఖవె నీవు ! సుభద్ర సూతినై
రంజిత పాణి పల్లవము - రాయుదునా !! నిను మౌళి దాల్చి, మృ
త్యుంజయ మూర్తినై ,జముని - తో, తొడ గొట్టి , సవాలు చేతునా!!

@@@@@@@@@@ సమాప్తం @@@@@@@@@@ 

click here "Sandhyasri "

Monday, February 28, 2011

ఘంటసాల - పద్యమాల( మనోహారిణి )

ఘంటసాల
గాన
గాఢాభిమానులకు

స్వాగతం
సుస్వాగతం

మనం
ఇంతవరకూ

01)పుష్ప విలాపం
02)గో ఘోష
03)కుంతీ కుమారి
04)అంజలి

పూర్తిచేసుకున్నాము.
ఇప్పుడు
ఐదవ అంకం
మనోహారిణిలోనికి
ప్రవేశిద్దాం.
దీని
విశిష్ఠత
ఏమిటంటే

ఇది మాస్టారి
మొట్ట మొదటి
రికార్డు
ఆ వివరాలు
పేకేటి మాటలతో సహా

కని
విని
ఆనందించండి.
 
మనోహారిణి

రచన : పేకేటి
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల


ఎవ్వరీ మనోహారిణి !
ఈమె , సుందర కళా సృష్టికి
ఈశ్వరుడు కల్పించిన ప్రమాణమేమో !!
ఆహా ! ప్రకృతి తన సౌందర్య మంతా
మూర్తిగొని నాకు సాక్షాత్కరిస్తున్నది!!!


01) || సీసము ||

నగు మోమునకు ,నిశా - నాథ బింబము జోడు !
కనుదమ్ములకు , నల్ల - కలువ లీడు !
మెయి తీగె , క్రొక్కారు - మెరుగు తీగియ బోలు !
అధరంబు , బింబమే - యనగ జాలు !
గురు నితంబ యుగమ్ము - కుతలమంతయు గ్రమ్ము !
లలి నడు మాకాశ - లక్ష్మి సొమ్ము !
కబరికా భారంబు - కాలాంబుధము మీరు !
పదములు హల్లక - పంక్తి గేరు !


||తేటగీతి ||

నాతి నూనూగు నూగారు - నాకు బారు !
మానిని గళంబు వర శంఖ - మంగళంబు !
తరుణి మాట లాహా!! అమృ - తంపు తేట !
పంకజాతాక్షి కుసుమాస్ త్రు - భాగ్య లక్ష్మి !


<<<<<<<<<<    సమాప్తం    >>>>>>>>>>

click here " Nagumomunaku "

Monday, February 21, 2011

ఘంటసాల - పద్యమాల ( అంజలి )

పుట్ట బోయే చిన్ని చిన్ని పాపాయిలకోసం
పొదుగు గిన్నెలలో పాలునింపడము


లక్షలాది కోట్లాది చెట్లకు లేత లేత
చిగురుటాకులు అంటించడము


తెల్లవారకుండానే కోటాను కోట్ల
మొగ్గలకు రంగులు వేయడము


అనేక కోట్ల [పూలు అనే] కంచాలలో తేనెటీగలకు
తియ్యటి భోజనము తయారు చెయ్యడము


మొదలైన పనులు ఒక్క క్షణం కూడా
విశ్రాంతి తీసుకోకుండా చేసి చేసి
అలసిపోతున్నాడట ఆ " దేవాదిదేవుడు "


ఓ మహానుభావా !!!
దేవ దేవా !!!
దేవాది దేవా !!!

రావయ్యా !!!
మా ఇంటికి రావయ్యా !!!
చాలా అలసిపోయావు గదూ !!!


ఒక్క
క్షణమైనా
కన్ను మూసి
విశ్రాంతి తీసుకో !!!

అని ఈ చరాచర
సృస్టి కంతటికీ
మూలాధారమైన

ఆ విశ్వబ్రహ్మపైనే
జాలి చూపిస్తున్నాడీకవి
అంతే కాదు విశ్రాంతి తీసుకోవడానికి
తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు


ఆహా!!!
ఎంత ధైర్యం!!!
ఏమా భావుకత!!!

అంత ధైర్యం చేయగలిగిన
కవి ఎవరనుకుంటున్నారు???
ఇంకెవరు? మన ఘంటసాల మాష్టారే !!!!!


తానే స్వయంగా రచించి
సంగీతం సమకూర్చి
గానంచేసి

మాష్టారు
మన కందించిన
మధుర
మంజుల
మనోహరమైన

ఆ "అంజలి" ని
తిలకించి
ఆలకించి
పులకరించండి.........


గీత రచన : ఘంటసాల
సంగీత రచన : ఘంటసాల
గానాలాపన : ఘంటసాల


ఎవ్వరిదీ కాళ్ళ చప్పుడు ?
ఎవ్వరో కాదు ! నా ప్రభువే !!!!!!
ప్రభూ ! నీవు కరుణా మయుడవు.
నీ సృష్టి కరుణామయము.
నా ఇంటికి నడచి వచ్చావా ప్రభూ !!!
ఈనాడు నా శిథిల జీవితానికి
ఒక మధుర ప్రభాతం.
నా హృదయానికి ఒక ఉదయశ్రీ.


01) || సీసము ||

పుట్టబోయెడి, బుల్లి - బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు , పాలు - పోసి , పోసి !


కలికి వెన్నెలలూరు - చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు - లతికి , అతికి !


పూల కంచాలలో - రోలంబములకు రే
పటి భోజనము, సిద్ధ - పరచి , పరచి !


తెలవారకుండ , మొ - గ్గల లోన జొరబడి
వింత,వింతల రంగు - వేసి , వేసి !


|| తేటగీతి ||

తీరికే లేని విశ్వ సం - సార మందు
అలసి పోయితి వేమొ , దే - వాధి దేవ !
ఒక్క నిమిషమ్ము, కన్ను మూ - యుదువు గాని
రమ్ము , తెరచితి మా కుటీ - రమ్ము తలుపు  !


02) || సీసము ||

కూర్చుండ , మా ఇంట - కురిచీలు లేవు , నా
ప్రణయాంకమే , సిద్ధ - పరచ నుంటి !


పాద్యమ్ము నిడ , మాకు - పన్నీరు లేదు , నా
కన్నీళ్ళ తో , కాళ్ళు - కడుగ నుంటి !


పూజకై ,మా వీట - పుష్పాలు లేవు , నా
ప్రేమాంజలులె , సమ - ర్పింప నుంటి !


నైవేద్య మిడ , మాకు - నారికేళము లేదు
హృదయమే , చేతి కం - దీయ నుంటి !


|| తేటగీతి ||

లోటు రానీయ , నున్నంత - లోన నీకు !
రమ్ము , దయ చేయు మాత్మ పీ - ఠమ్ము పైకి !
అమృత ఝరి చిందు , నీ పదాం - కముల యందు
కోటి స్వర్గాలు , మొలిపించు - కొనుచు , తండ్రి  !


అంజలి ని
తిలకించారు
గదా
ఇక
ఆలకించి
పులకరించండి


********** సమాప్తం **********

click here " Anjanli "