Monday, February 21, 2011

ఘంటసాల - పద్యమాల ( అంజలి )

పుట్ట బోయే చిన్ని చిన్ని పాపాయిలకోసం
పొదుగు గిన్నెలలో పాలునింపడము


లక్షలాది కోట్లాది చెట్లకు లేత లేత
చిగురుటాకులు అంటించడము


తెల్లవారకుండానే కోటాను కోట్ల
మొగ్గలకు రంగులు వేయడము


అనేక కోట్ల [పూలు అనే] కంచాలలో తేనెటీగలకు
తియ్యటి భోజనము తయారు చెయ్యడము


మొదలైన పనులు ఒక్క క్షణం కూడా
విశ్రాంతి తీసుకోకుండా చేసి చేసి
అలసిపోతున్నాడట ఆ " దేవాదిదేవుడు "


ఓ మహానుభావా !!!
దేవ దేవా !!!
దేవాది దేవా !!!

రావయ్యా !!!
మా ఇంటికి రావయ్యా !!!
చాలా అలసిపోయావు గదూ !!!


ఒక్క
క్షణమైనా
కన్ను మూసి
విశ్రాంతి తీసుకో !!!

అని ఈ చరాచర
సృస్టి కంతటికీ
మూలాధారమైన

ఆ విశ్వబ్రహ్మపైనే
జాలి చూపిస్తున్నాడీకవి
అంతే కాదు విశ్రాంతి తీసుకోవడానికి
తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు


ఆహా!!!
ఎంత ధైర్యం!!!
ఏమా భావుకత!!!

అంత ధైర్యం చేయగలిగిన
కవి ఎవరనుకుంటున్నారు???
ఇంకెవరు? మన ఘంటసాల మాష్టారే !!!!!


తానే స్వయంగా రచించి
సంగీతం సమకూర్చి
గానంచేసి

మాష్టారు
మన కందించిన
మధుర
మంజుల
మనోహరమైన

ఆ "అంజలి" ని
తిలకించి
ఆలకించి
పులకరించండి.........


గీత రచన : ఘంటసాల
సంగీత రచన : ఘంటసాల
గానాలాపన : ఘంటసాల


ఎవ్వరిదీ కాళ్ళ చప్పుడు ?
ఎవ్వరో కాదు ! నా ప్రభువే !!!!!!
ప్రభూ ! నీవు కరుణా మయుడవు.
నీ సృష్టి కరుణామయము.
నా ఇంటికి నడచి వచ్చావా ప్రభూ !!!
ఈనాడు నా శిథిల జీవితానికి
ఒక మధుర ప్రభాతం.
నా హృదయానికి ఒక ఉదయశ్రీ.


01) || సీసము ||

పుట్టబోయెడి, బుల్లి - బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు , పాలు - పోసి , పోసి !


కలికి వెన్నెలలూరు - చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు - లతికి , అతికి !


పూల కంచాలలో - రోలంబములకు రే
పటి భోజనము, సిద్ధ - పరచి , పరచి !


తెలవారకుండ , మొ - గ్గల లోన జొరబడి
వింత,వింతల రంగు - వేసి , వేసి !


|| తేటగీతి ||

తీరికే లేని విశ్వ సం - సార మందు
అలసి పోయితి వేమొ , దే - వాధి దేవ !
ఒక్క నిమిషమ్ము, కన్ను మూ - యుదువు గాని
రమ్ము , తెరచితి మా కుటీ - రమ్ము తలుపు  !


02) || సీసము ||

కూర్చుండ , మా ఇంట - కురిచీలు లేవు , నా
ప్రణయాంకమే , సిద్ధ - పరచ నుంటి !


పాద్యమ్ము నిడ , మాకు - పన్నీరు లేదు , నా
కన్నీళ్ళ తో , కాళ్ళు - కడుగ నుంటి !


పూజకై ,మా వీట - పుష్పాలు లేవు , నా
ప్రేమాంజలులె , సమ - ర్పింప నుంటి !


నైవేద్య మిడ , మాకు - నారికేళము లేదు
హృదయమే , చేతి కం - దీయ నుంటి !


|| తేటగీతి ||

లోటు రానీయ , నున్నంత - లోన నీకు !
రమ్ము , దయ చేయు మాత్మ పీ - ఠమ్ము పైకి !
అమృత ఝరి చిందు , నీ పదాం - కముల యందు
కోటి స్వర్గాలు , మొలిపించు - కొనుచు , తండ్రి  !


అంజలి ని
తిలకించారు
గదా
ఇక
ఆలకించి
పులకరించండి


********** సమాప్తం **********

click here " Anjanli "

2 comments:

  1. వసంత కిశోర్ గారు,
    ఈ రోజే మీ Blog చూసాను. ఘంటసాల వారు పాడిన పద్యాలు అంద జేస్తున్నందుకు ధన్య వాదాలు.
    ఈ పద్య రచన కరుణ శ్రీ గారు అనుకుంట. మీరు గీత రచన : ఘంటసాల అని వ్రాసారు!!

    ReplyDelete
  2. సత్యనారాయణగారూ ! ధన్యవాదములు !
    అవును నిజమే నెనే పొరబడ్డాను ఏదో పుస్తకంలో చూసి
    ఇది కరుణశ్రీ గారి రచనే

    ReplyDelete