గాన
గంధర్వుడు
ఘంటసాల
అభిమానులకు
స్వాగతం
సుస్వాగతం
ఘంటసాల - పద్యమాల
కార్యక్రమానికి
స్వాగతం
గాన
గంధర్వుడు
ఘంటసాల
అత్యంత
అద్భుతంగా
అమర
గానం
చేసిన
మధురమైన
పద్యాలు
ఎన్నో
ఉన్నాయి
వాటిలో
మనం
ఇప్పటివరకూ
01) పుష్ప విలాపం
02) గో ఘోష
03) కుంతీ కుమారి
04) అంజలి
05) మనోహారిణి
06) సాంధ్యశ్రీ
07) అద్వైత మూర్తి
08) ప్రభాతి
పూర్తిచేసుకున్నాము.
ఇప్పుడు
తొమ్మిదవ అంకం
హరిశ్చంద్ర ( సినిమా )
లోనికి
ప్రవేశిద్దాం.
హరిశ్చంద్ర - 1956
ఒకనాడు ఇంద్ర సభలో సత్యం మీద చర్చ జరుగుతుంది !
ఈ ముల్లోకముల లోనూ సత్య నిష్ఠ పాటించే వారెందైనా
గలరా ? అని దేవేంద్రుడు ప్రశ్నిస్తాడు !
భూలోకములో హరిశ్చంద్ర చక్రవర్తి గలడు !
అతడు నిత్య సత్య దీక్షా పరుడని చెబుతాడు వశిష్టుడు !
మామూలు పరిస్థితులలో ఎవరైనా పాటిస్తారు !
విపత్కర పరిస్థితులలో ఎటువంటి వారైనా
అబద్ద మాడక తప్పదని విశ్వామిత్రు డంటాడు !
సూర్యుడు పడమటి దిక్కున ఉదయించ వచ్చు నేమో గాని
ఎటువంటి పరిస్థితిలో నైనా హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పడని
వశిష్టుడు చెప్పిన మాటలకు ఒప్పుకొనక , విశ్వామిత్రుడు
హరిశ్చంద్రుని సత్యదీక్షను పరీక్షింప బూనుకొంటాడు !
*****
వెంటనే విశ్వా మిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు వచ్చి
ఓ రాజా ! నేనొక యాగం సంకల్పించాను !
దానికి , ఒక బలవంతుడైన మనిషి ఏనుగు పై నిలబడి
ఒక రత్నమును బలముగా ఎంత ఎత్తు విసర గలడో
అంతెత్తు ధనరాశి కావలయునని అడుగుతాడు !
అటులనే మహాత్మా ! దాని నిప్పుడే మీ ఆశ్రమమునకు
తరలించే ఏర్పాటు చేస్తానన్న హరిశ్చంద్రుని
ఆ ఋషి వారించి, మహారాజా ! యాగము మొదలుపెట్టుటకు
కొంత తడ వున్నది ! అంత దనుక , నా ధనము , నీ వద్దనే యుంచి ,
నేను యాగము ప్రారంభించబోవు సమయమున కబురు జేసెదను
అప్పుడు పంపుము ! అని జెప్పి వెడలి పోతాడు !
తన పరీక్ష నింకా ఉధృతం జేయనెంచిన ఆ ఋషి
క్రూర మృగములను సృష్టించి , హరిశ్చంద్రుడు
వేటకు వచ్చేలా చేస్తాడు ! వేటాడి అలసి , విడిది చేసియున్న
హరిశ్చంద్రుని వద్దకు , మాతంగ కన్యలను సృష్టించి పంపుతాడు !
ఆ కన్యల ఆట పాటలకు మెచ్చిన హరిశ్చంద్రుడు
బహుమానా లివ్వబోతే , వారు నిరాకరించి
హరిశ్చంద్రుని వివాహ మాడ గోరతారు !
దానికి నిరాకరిస్తాడా చక్రవర్తి !
ఇదే అదనని విశ్వా మిత్రుడక్కడికి వచ్చి
తన మానస పుత్రికలైన ఆ కన్యలను
వివాహమాడి వారి కోరిక దీర్చమని
శాసిస్తాడు !
రచన : బలిజేపల్లి
సంగీతం : సుసర్ల దక్షిణా మూర్తి
గానం : ఘంటసాల
అప్పుడు హరిశ్చంద్రుడు ఆ మునితో :
01) || మత్తేభము ||
స్ఫురణం , బిప్పటి కెన్నడో , జరిగె ! స - త్పుత్రుండు పుట్టెన్ ! వయః
పరిపాకంబును , తప్పుచున్న యది ! ఈ - ప్రాయంబునన్ , వర్ణ సం
కరపుం పెండిలి , ఏల చుట్టెదవు ? నా - కంఠంబునన్ , కౌశికా!!!
ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "
మహాత్మా ! వంశాభివృద్ధి కోసమే గదా వివాహము !
నాకు వివాహము జరిగి , ఒక చక్కని పుత్రుడు కూడా
గలడు ! ఈ వయస్సులో నన్నెందుకు రెండవ పెళ్ళి
చేసుకోమని నిర్భందిస్తావు ! ఈ కన్యలను
వివాహ మాడుట తప్ప , నా ప్రాణములు గాని
నా సంపదలుగాని లేదా నా సమస్త రాజ్యమూ
కావలెనన్న నీకు సమర్పించ గలవాడను
అన్న హరిశ్చంద్రునితో "అటులైన నీ రాజ్యమును
నాకు సమర్పింపుమని అడుగుతాడు విశ్వామిత్రుడు !
తన రాజ్యమును విశ్వామిత్రునికి దానం చేస్తూ
హరిశ్చంద్రుడు :
02) || శార్దూలము ||
దేవ బ్రాహ్మణ మాన్యముల్విడచి , భ - క్తిన్ , సప్త పాదోధి వే
లా విభ్రాజ దఖండ భూవలయ మె - ల్లన్ , నీకు , దానంబుగా
భావంబందొక శంక లే కొసగితిన్ - బ్రహ్మార్పణం బంచు , దే
వా, విశ్రాంతిగ,యేలు కొమ్మికను,నీ - వాచంద్ర తారార్కమున్!
ఈ పద్యం వినాలంటే ఇక్కడ నొక్కండి " హరిశ్చంద్ర "
No comments:
Post a Comment