Friday, August 20, 2010

ఘంటసాల - పద్యమాల (పుష్ప విలాపం)

గాన

గంధర్వుడు
ఘంటసాల

అభిమానులకు
స్వాగతం
సుస్వాగతం


ఘంటసాల - పద్యమాల
కార్యక్రమానికి
స్వాగతం


గాన
గంధర్వుడు
ఘంటసాల


అత్యంత
అద్భుతంగా
అమర


గానం
చేసిన
మధురమైన


పద్యాలు
ఎన్నో
ఉన్నాయి


దేవుడు
సృష్టించిన
పూలతో


దేవుణ్ణి
పూజిస్తాం
గదా

అలాగే
గాన
గంధర్వుని

ఆయన
పద్యాలతోనే
అర్చిద్దాం


రండి
అమరగాయకుని
అభిమానులందరూ


ఇందులో
పాలు
పంచుకోండి

01) పుష్ప విలాపం


రచన : కరుణశ్రీ
సంగీతం మరియు గానం : ఘంటసాల

నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభూ !


ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళ కళ లాడుతోంది.పూలబాలలు తల్లి


ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకొంటున్నాయి. అప్పుడు


i) || ఉత్పలమాల ||

నేనొక పూల మొక్క కడ - నిల్చి చివాలున కొమ్మ వంచి గో

రానెడు నంత లోన విరు - లన్నియు జాలిగ నోళ్ళు విప్పి మా


ప్రాణము దీతువా యనుచు - బావురు మన్నవి కృంగిపోతి నా


మానస మందెదో తళుకు - మన్నది పుష్ప విలాప కావ్యమై
 
అంతలో ఒక సన్న జాజి కన్నె సన్నని గొంతుకతో నన్ను జూ చి ఇలా అన్నది


ప్రభూ!!!

(2)  || ఉత్పలమాల ||

ఆయువు కల్గు నాల్గు ఘడి  - యల్ కని పెంచిన తీవె తల్లి జా

తీయత దిద్ది తీర్తుము త్వ - దీయ కరమ్ముల లోన స్వేచ్చమై

నూయల లూగుచున్ మురియు - చుందుము ఆయువు తీరి నంతనే

హాయిగ కన్ను మూసెదము  - ఆ యమ చల్లని కాలి వేళ్ళ పై

ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికడ్డు వస్తావ్ ? మేం నీకేమపకారం చేశాం ?


(3)  || ఉత్పలమాల ||

గాలిని గౌరవింతుము సు - గంధము పూసి!  సమాశ్రయించు భృం


గాలకు విందు చేసెదము - కమ్మని తేనెలు మిము బోంట్ల నే


త్రాలకు హాయి గూర్తుము స్వ - తంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ది తో


తాళుము త్రుంప బోవకుము - తల్లికి బిడ్డకు వేరు సేతువే


ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా



ఎఱ్ఱ బడి ఇలా అన్నది ప్రభూ!

(4) || తేటగీతి ||

ఊలు దారాల తో గొంతు - కురి బిగించి

గుండె లోనుండి సూదులు - గ్రుచ్చి కూర్చి

ముడుచు కొందురు ముచ్చట - ముడుల మమ్ము


అకట ! దయలేని వారు మీ - ఆడ వారు

పాపం మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే !


(5) || ఉత్పలమాల ||

మా వెల లేని ముగ్ధ సుకు - మార సుగంధ మరంద మాధురీ


జీవిత మెల్ల మీకయి త్య  - జించి కృశించి నశించి పోయె; మా


యవ్వన మెల్ల కొల్ల గొని -  ఆపయి చీపురు తోడ చిమ్మి , మ


మ్మావల పార వోతురు గ  - దా ! నర జాతికి నీతి యున్నదా ?

ఓయి మానవుడా !!!


(6) || తేటగీతి ||

బుద్ధ దేవుని భూమిలో - పుట్టి నావు


సహజ మగు ప్రేమ నీలోన - చచ్చె నేమొ


అందమును హత్య చేసెడి - హంత కుండ

మైల పడి పోయె నోయి నీ - మనుజ జన్మ


అని దూషించు పూల కన్నియల కోయలేక ఒఠ్ఠి చేతులతో వచ్చిన నా ఈ హృదయ

కుసుమాంజలిని గై కొని నాపై నీ కరుణ శ్రి రేఖలను ప్రసరింపుము ప్రభూ !

ప్రభూ...ఊ.......ఉ..ఊ..........ఉ..ఊ........

ఉ..ఊ........ఉ.ఊ...... ఉ.ఊ.................

click here " Pushpavilapam -1 "

click here " Pushpavilapam - 2 "

No comments:

Post a Comment